తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్ర విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై మక్కువ చూపుతున్నారు. రీసెంట్ గా రిలీజయిన ఓ బేబీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నందిని రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఓ బేబీ మూవీ సక్సెస్ తో హ్యాపీ గా ఉన్న సమంత నందిని రెడ్డి టేకింగ్ కు ఇంప్రెసయి మరొక మూవీ లో నటిస్తానని ప్రామిస్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ బేబీ మూవీ షూటింగ్ టైమ్ లో దర్శకురాలు నందిని రెడ్డి ఒక థ్రిల్లర్ స్టోరీ ని రెడీ చేశారు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని నందినిని సమంత కోరారు. లేడీ డైరెక్టర్ నందిని పై ఉన్న కాన్ఫిడెన్స్ తో సమంత మరో మూవీ లో నటించడానికి డిసైడ్ అయ్యారు. ఈ థ్రిల్లర్ మూవీ సమంత, నాగచైతన్య సహ నిర్మాతలుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందనుందని సమాచారం. అలామొదలైంది వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి దర్శకత్వం వహించిన నందిని 9 సంవత్సరాల తరువాత ఓ బేబీ మూవీ తో విజయం సాధించారు.
[youtube_video videoid=V_bf–w_eeU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: