రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ‘ఆడై’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలా పాల్. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వీ స్టూడియోస్ బ్యానర్‌పై విజ్జి సుబ్రమణియన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.జులై 19వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. మొత్తానికి చూడబోతే ఈ సినిమాతో అమలాపాల్ సంచనాలు సృష్టించేలా కనిపిస్తోంది.
[youtube_video videoid=Ob-NKC4VOzI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: