రానా దగ్గుబాటి హీరోగా నటించిన పొలిటికల్ మూవీస్ లీడర్, నేనే రాజు నేనే మంత్రి ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు రానా మరొక పొలిటికల్ డ్రామా లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాట పర్వం మూవీ రూపొందనుంది. సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడిక్ డ్రామా గా రూపొందనున్న విరాట పర్వం మూవీ తెలంగాణ రాష్ట్రం లోని కరీం నగర్, వరంగల్ జిల్లాలలో షూటింగ్ జరుపుకోనుంది. ఫిదా, MCA వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు. విరాటపర్వం స్టోరీ వినగానే తన అంగీకారం తెలిపారు. విరాటపర్వం మూవీ లో రానా క్యారెక్టర్ కు సాయి పల్లవి క్యారెక్టర్ ఈక్వల్ గా ఉంటుందని సమాచారం.
[youtube_video videoid=bCITH3-eaRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: