ఇప్పటికే నటుడు, దర్శకుడు, రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ వంటి ఓ గొప్ప వ్యక్తిని సినీ పరిశ్రమ కోల్పోగా.. ఇప్పుడు మరో ప్రముఖ సీనియర్ కమెడియన్ కూడా ఈరోజే తుది శ్వాస విడిచారు. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) మృతి చెందారు. సడెన్ గా గుండెపోటు వచ్చిన ఆయన్ని కావేరి హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా క్రేజీ మోహన్ 1952లో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. చదువుకునే రోజుల్లోనే కొన్ని నాటకాలకు స్క్రిప్ట్ లు రాసేవారు. `క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం` అనే నాటకం తర్వాత ఈయనకు క్రేజీ మోహన్ అనే పేరు వచ్చింది. కె. బాలచందర్ దర్శకత్వంలో ‘పొయ్‌కల్ కుదరై’ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా క్రేజీ మోహన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలీలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా, రైటర్ గానే కాదు.. చిత్రకారుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
[youtube_video videoid=SFDOPGipFPQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: