చాలా ఎగ్జైటింగ్ గా ఉంది

Pooja Hegde Super Excited about Character in Valmiki,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Pooja Hegde Role In Valmiki Movie Actress Pooja Hegde Next Film With Varun Tej
Pooja Hegde Super Excited about Character in Valmiki

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌హిట్‌ ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్వీట్ పై స్పందిస్తూ పూజా హెగ్డే కూడా ఆనందంతో ట్వీట్‌ చేశారు. ‘ఈ సినిమాలో అత్యంత ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుండటం చాలా ఉత్సాహంగా ఉంది. టాలెంటెడ్ టీమ్ తో కలసి మరోసారి వర్క్ చేస్తున్నా అని ట్వీట్‌ లో పేర్కొంది. హరీష్‌ శంకర్‌ తీసిన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’లో.. ముకుంద సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 

కాగా ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=-h5qq8W57B8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =