సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ 9వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 17వ తేదీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో మహేష్ బాబు ముచ్చటించారు. మహర్షి మూవీ గురించి, తాను నటించిన మూవీస్ గురించి, టాలీవుడ్ లో తన జర్నీ గురించి మహేష్ బాబు మాటల్లోనే ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలా సంతోషం గా ఉన్నానని, మహర్షి మూవీ తన సినీ కెరీర్ కు ల్యాండ్ మార్క్ చిత్రమని, తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అధిగమించి మహర్షి మూవీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ కావడం థ్రిల్లింగ్ గా ఉందని, ప్రేక్షకులకు మెసేజ్ తో కూడుకున్న సామాజిక సంబంధ చిత్రాలలో నటించడం ఇష్టం అన్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించినందుకు సంతోషంగా ఉందన్నారు . మహర్షి మూవీ లో మెయిన్ థీమ్ వీకెండ్ ఫార్మింగ్ అని, రైతులతో పనిచేయడంతో తనలో మార్పు వచ్చిందని, తన మూలాలు తెలుసుకున్నానని, వ్యవసాయం యొక్క ఆవశ్యకతను ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలన్నారు.మహర్షి మూవీ ప్రేరణతో విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కలిగించాలని స్కూల్ అథారిటీస్ నిశ్చయించుకున్నారు.
[subscribe]
[youtube_video videoid=6-4SqHmf1ao]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: