యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం సీత
. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రేక్షకుల నుండి ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`నా పేరు సీత నేను గీసిందే గీత, ప్రాస బావుంది కదూ! అంటూ కాజల్ అగర్వాల్ చెప్పే డైలాగ్.. ఇది పెద్ద కంచులా ఉందిరా! బాబూ అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్
రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు` అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్.. ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రమిది. అంతేకాదు ఈ సినిమాలో కాజల్ నెగెటివ్ షేడ్ లో నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను సీత సినిమా రీచ్ అవుతుందో? లేదో? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్
సమర్పణ: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రపీ: శిర్షా రే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: కనల్ కణ్ణన్
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
[subscribe]
[youtube_video videoid=Ry_4LeMYMLU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: