కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి. కొన్ని పాత్రలు అదృష్టం కొద్ది కలిసొస్తాయి. అలా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని.. ఆ పాత్రలను వాడుకున్న వారికి మంచి ప్రశంసలు దక్కుతాయి. ఒక్కోసారి అదృష్టం బాలేనప్పుడు ఆ పాత్రలను వదలుకొని బాధ పడిన హీరోలు, హీరోయిన్ లు.. కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు అలాాంటి పాత్రనే దక్కించుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు అల్లరి నరేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహర్షి సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి లో మహేష్ ఫ్రెండ్ గా ఓ కీలకమైన పాత్రలో నటించాడు నరేష్. రవి అనే పాత్రలో ఓ గ్రామానికి చెందిన అబ్బాయి గెటప్ లో… అమాయకత్వం తో చాలా బాగా నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే అల్లరి నరేష్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ పాత్రలో తను తప్పా మరెవరూ చేయరన్నంతగా నటించి మెప్పించాడు.
అల్లరి సినిమాతో రవి పాత్రలో తన కెరీర్ ను ప్రారంభించి… అదే సినిమాను ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ కామెడీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన పంచులతో.. చిలిపి చేష్టలతో.. ఆడియన్స్ కు ‘కితకితలు’ పెట్టించాడు. రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి.. నవ్వించే నటుడు ఎవరని అడిగితే అది ఖచ్చితంగా నరేషే అని చెప్తాం. ఇప్పుడున్న హీరోల్లో 17 ఏళ్లల్లో 50కు పైగా సినిమాలు చేసిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అల్లరి నరేషే. ఇక హీరోగా నటిస్తూనే.. అటు గమ్యం లాంటి సినిమాల్లో గాలి శీను లాంటి గుర్తింపు ఉన్న పాత్రల్లో కూడా నటించాడు. ఈ మధ్యనే వరుస ఫ్లాప్స్ పడి కెరీర్ కొంచెం డౌన్ కావడంతో.. కొత్తగా ఆలోచించి.. వినూత్న ప్రయోగానికి తెరలేపాడు. పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ అయినా చేయడానికి సిద్దమయ్యాడు. అలా వచ్చిన పాత్రే మహర్షి. మహర్షి సినిమాలోని రవి పాత్రతో సక్సెస్ కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అల్లరి లోని రవి తో మొదలు పెట్టిన ప్రయాణంలో ఆ సినిమాతో ఎలా సక్సెస్ కొట్టాడో.. ఇప్పుడు మహర్షి లోని రవి సినిమాలో రవి పాత్ర తో కూడా అంత సక్సెస్ అందుకున్నాడు. మరి నరేష్ ముందు ముందు కూడా ఇలాంటి గుర్తుండి పోయే మంచి పాత్రలు చేయాలని కోరుకుందాం..
[subscribe]
[youtube_video videoid=B9_AnB9WRZw ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: