అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలన విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 75కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సినిమా గా రికార్డు సృష్టించింది. వీటితో పాటు పలు రికార్డులు సృష్టించిన ఎఫ్2 తాజాగా మరో రికార్డ్ ను కూడా సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ రికార్డ్ ఎంటంటే.. ఈ సినిమా ఇటీవల స్టార్ మా టీవీ లో ప్రసారం కాగా 17.2 రేటింగ్స్ ను రాబట్టి బుల్లితెర పై కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తో పాటు ఇటీవల టెలివిజన్ లో యాత్ర ,పేట సినిమాలు ప్రసారం కాగా యాత్ర 6.2 రేటింగ్స్ ను అలాగే పేట 3.9 రేటింగ్స్ ను రాబట్టుకున్నాయి. మొత్తానికి ఎఫ్2 సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
[youtube_video videoid=DoMao3a-E24]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: