కాంచన 3లో హైలైట్ అదేనట!

kanchana 3 Movie Climax Turns Highlight,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,kanchana 3 Movie Highlights,kanchana 3 Movie Latest Updates,kanchana 3 Climax Scene,Climax Turns Highlight From kanchana 3
kanchana 3 Movie Climax Turns Highlight

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. ఇక ఆతరువాత దాని సీక్వెల్ లో తీసిన కాంచన, గంగ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు మరోసారి కాంచన 3 అనే సీక్వెల్ తో భయపెట్టడానికి వస్తున్నాడు. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెట్టేసింది.

ఇక రేపు అంటే ఏప్రిల్ 19వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ హైలైట్ గా నిలవనుందట. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ థ్రిల్ కు గురిచేస్తాయట. దీంతోపాటు లారెన్స్ ఓల్డ్ గెటప్ కూడా సినిమాకు మరో హైలైట్ గా నిలవనుందట.

కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న ఈసినిమాను.. తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నారు. మరి ఇప్పటివరకూ విడుదలైన మూడు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. మరి కాంచన 3 ఎలా ఉంటుందో చూద్దాం.

[subscribe]


[youtube_video videoid=s01YohDdGZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.