పాత్ బ్రేకింగ్ అండ్ పాత్ షోయింగ్ డీసెంట్ ఎటెంప్ట్ “చిత్రలహరి”

Chitralahari Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Chitralahari Movie Review,Chitralahari Review,Chitralahari Movie Review and Rating,Chitralahari Movie Story,Chitralahari Movie Plus Points,Chitralahari Movie Live Udates,Chitralahari Movie Public Talk,Chitralahari Movie Public Response,#ChitralahariReview
Chitralahari Telugu Movie Review

ఎప్పుడూ గెలిచేవాడే సినిమా హీరో
ఎప్పుడూ తన్నేవాడే  సినిమా హీరో
ఎప్పుడూ  ప్రేమించేవాడే సినిమా హీరో
ఒక్క మాటలో చెప్పాలంటే భూమ్మీద నిలవని వాడు.. ఆకాశంలో విహరించే వాడు,  ఎందరినైనా ఎదిరించే వాడు ఎలాంటి ఘనకార్యాలైయినా చిటికెలో సాధించేవాడు .. ఇంకా ఇంకా చెప్పాలంటే వీరుడు- ధీరుడు- శూరుడు- సూర్యుడు – హీరోను ఇన్ని గొప్ప లక్షణాల సాహస వీరుడిగా చూపించటం “రెగ్యులర్ పాత్”…హీరో కూడా మన ఇళ్లలో మన మధ్యన మసలే సామాన్య మధ్యతరగతి మందహాస ప్రతిరూపం అని చూపించటం “బ్రేకింగ్ ద పాత్”. జీవితమంటే సక్సెస్… సక్సెస్సే జీవితం సక్సెస్ లేని జీవితం వేస్ట్… అనుకుంటూ సక్సెస్ కోసం పరితపించి, పరుగులు పెట్టి, అది దొరక్కపోతే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే అర్భక మనస్కుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం ఒక సినిమా రావటం ప్రజెంట్ కమర్షియల్ ట్రెండ్ లో మేకర్స్ పరంగా గొప్ప సాహసం అనే చెప్పాలి. అయితే ఈ సందేశాన్ని ఇవ్వటం కోసం వాళ్ళు సినిమా తీయకపోయినా తీసిన సినిమాలో ఇంత మంచి ‘సే’ ఉండటం అభినందనీయం. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా… ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “చిత్రలహరి”. హ్యాట్రిక్ ప్రొడ్యూసర్స్ అయిన “మైత్రి మూవీ మేకర్స్” కిషోర్ తిరుమల దర్శకత్వంలో  “సాయి తేజ్” గా  పేరును కుదించుకున్న సాయి ధరమ్ తేజ్ హీరోగా నిర్మించిన చిత్రం “చిత్రలహరి”. ఈ పేరు కుదింపు సెంటిమెంటల్ గా తేజు కు విజయాన్ని అందించిందో లేదో చిత్రలహరి రివ్యూ లో చూద్దాం.

ఇందులో హీరో విజయ్ కృష్ణ( సాయి తేజ్) ఒక మధ్యతరగతి ఉద్యోగి( పోసాని కృష్ణ మురళి) కొడుకు. చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న విజయ్ కి ఎక్కడా ఉద్యోగం రాదు. మెకానికల్ ఇంజనీర్ అయిన తను ఉద్యోగం చేయటం  కన్నా స్వతంత్రంగా ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్నవాడు. పట్టుదల, తెలివితేటలు, మంచితనం వంటి మంచి లక్షణాలతో పాటు బాబు మంచి మందు ప్రియుడు కూడా. అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ లో పరిచయమైన సింగర్ (సునీల్) ను   “గ్లాస్ మేట్” అంటూ మంచి స్నేహితులవుతారు. వీళ్ళ పరిచయానికి ప్యారలల్ గా పరిచయమైన”లహరి”(  కళ్యాణి ప్రియదర్శని)ని విజయ్ ప్రేమిస్తాడు. ప్రేమను దక్కించుకోవడం కోసం ఆమెకు మందు అలవాటు లేదని, మంచి ఉద్యోగం చేస్తున్నాను అని చిన్న చిన్న అబద్దాలు చెప్తాడు. ఇదిలా ఉంటే తన ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైన గొప్ప కాన్సెప్ట్ను ప్రజెంట్ చేసినప్పటికీ అతనికి ఎవరు అవకాశం ఇవ్వరు. అయితే తన ప్రాజెక్టులోని స్పార్క్ ను గమనించిన ఒక కంపెనీ దాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తుంది.

దానితో ఆ ప్రాజెక్ట్ నే వదిలేసి మరలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు… అదే సమయంలో ఒక ఫ్రెండు మాటల ప్రభావంతో విజయ్ ప్రేమను తిరస్కరిస్తుంది లహరి. “మనిద్దరికీ పడదు విడిపోదాం” అని బ్రేకింగ్ ప్రపోజల్ చెప్పి విజయ్ జీవితం నుండి తప్పుకుంటుంది లహరి. ఆ తర్వాత విజయ్ ప్రాజెక్టుకు ఎలాంటి గుర్తింపు వచ్చింది… లహరి ని తప్పుదోవ పట్టించిన ఫ్రెండు ఎవరు? విజయ్ లహరిల ప్రేమ విజయవంతం అయిందా?  అపజయానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి విజయ్ జీవితంలో సక్సెస్ ఏ రూపంలో వచ్చింది? ఆ సక్సెస్ కోసం అతను చేసిన సాహసం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది చిత్రలహరి క్లైమాక్స్.

ఇదీ విహంగ వీక్షణంగా  “చిత్రలహరి” కథాంశం. ఈ సినిమా విషయంలో ముందుగా అభినందించాల్సింది మైత్రి మూవీ మేకర్స్ అధినేతలను. మెగా కాంపౌండ్ నుండి అద్భుత విజయాలను అందుకున్న ఒక యంగ్ కమర్షియల్ హీరో దొరికితే కమర్షియల్ గా ఎంత పిండుకోవచ్చు… దండు కోవచ్చు అని కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫీల్ గుడ్ చిత్రాన్ని ఇవ్వాలి అన్న లక్ష్యంతో ఈ కథను యాక్సెప్ట్ చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ముందుగా అభినందనలు. నిజానికి ఈ సినిమాకు ముందు హీరోకు వరుసగా పరాజయాలు ఉన్నప్పటికీ సబ్జెక్టు మీద నమ్మకంతో ముందడుగు వేసిన నిర్మాతల గట్స్ కు హ్యాట్సాఫ్.

ఇక దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సబ్జెక్టును డీల్ చేసిన విధానం simply lovable . హీరో  సక్సెస్ ను గ్లోరిఫై చేస్తూ గతంలో చాలా సినిమాలు  వచ్చాయి కానీ… హీరో  ఫెయిల్డ్    స్టోరీని తన స్టోరీ లైన్ గా తీసుకొని ఒక సినిమా చేయటం దర్శకుడి గట్స్ కు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. నిజానికి ప్రపంచంలో సక్సెస్ శాతం 10 మాత్రమే. సినీ రాజకీయ వ్యాపారాది సకల రంగాలను నడిపించేది పది శాతం సక్సెస్ మాత్రమే.10 శాతం సక్సెస్ రేటు తోనే మనం ఇంత మంచి జీవితాలను గడుపుతున్నాం అంటే జీవితంలో సక్సెస్ పాత్ర , దాని ప్రభావం చాలా తక్కువ అనే చెప్పాలి. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కోట్లు సంపాదించడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడమే సక్సస్ అనుకునే వారి  భ్రమలను తొలగించే ప్రయత్నం చేశాడు  దర్శకుడు కిషోర్ తిరుమల.

ప్రేమ, సక్సెస్, ఫెయిల్యూర్ వంటి ఎలిమెంట్స్ ను, వాటి ప్రభావాన్ని ఏ మేరకు సీరియస్ గా తీసుకోవాలి, ఏ మేరకు లైట్ గా తీసుకోవాలి , వాటిపట్ల మన ఆటిట్యూడ్, రియాక్షన్స్ ఏ మోతాదులో ఉండాలి అనే అంశాలను  అండర్ కరెంట్ గా చాలా సెన్సిబుల్ గా చెప్పాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అయితే ఇందులో దర్శకుడిగా కంటే రచయితగానే మంచి డెప్త్ ను ప్రదర్శించాడు కిషోర్ తిరుమల. నిజంగా కొన్ని డైలాగులు రాసుకున్న విధానం, వాటిని తెరమీద చెప్పిన విధానం చాలా బాగున్నాయి. కథావస్తువులో రెండున్నర గంటల సినిమాకు కావలసినంత మెటీరియల్ లేకపోయినప్పటికీ చాలా  అర్థవంతమైన సెన్సిబుల్ డైలాగ్స్ తో ఆ లోటును భర్తీ చేశాడు దర్శకుడు. అంత బాగా డీల్ చేసినప్పటికీ ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం, సెకండాఫ్ లో కొంత భాగం  డ్రాగింగ్ ఉంది అన్న  ఫీలింగ్ కలిగింది. అయితే ఓవరాల్ గా చిత్రలహరి చిత్రాన్ని ఒక డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ యటెంప్ట్ గా అభినందించవచ్చు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే- సాయి తేజ్ ఆశనిరాశల మధ్య ఊగిసలాడే విజయ్ పాత్రలోని సంఘర్షణను చక్కగా అభినయించాడు. తన నిజజీవితంలో కూడా తొలుత వరుస విజయాల అద్భుత శిఖరారోహణ కనిపిస్తుంది. ఆ తరువాత  కొన్ని అనూహ్య పరాజయాల అవరోహణ కనిపిస్తుంది. అంటే సక్సెస్ తాలూకు ఆనందం ఫెయిల్యూర్ తాలూకు బాధ తనకు బాగా తెలుసు. సక్సెస్ అనేది స్విగ్గి లో ఇచ్చే ఆర్డర్ లాంటిది కాదు వెంటనే రావటానికి. జీవితాలు పణంగా పెట్టినా కొందరి జీవితాల్లో విజయం తాలూకు విలాసాన్ని  చూడలేము. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ క్యారెక్టర్ను సాయి ధరమ్ తేజ్…( సారీ! పేరు మార్చుకున్నాడు కదా!)  సాయి తేజ్ చాలా బాగా చేశాడు. ఇక హీరోయిన్స్ గా కళ్యాణి ప్రియదర్శన్, నివేదిత పేతురాజ్ వారి వారి పాత్రలకు చాలా చక్కగా షూట్టయ్యారు.

ఇక టెక్నికల్ అంశాలకు వస్తే- దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రెండు పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. నిర్మాతల మేకింగ్ standards బాగున్నాయి. మొత్తానికి అక్కడక్కడ కొంచెం డ్రాపింగ్ ఉన్నట్టు అనిపించినప్పటికీ మొత్తం మీద “చిత్రలహరి” ని వర్త్ వాచింగ్ మూవీ గా అభినందించవచ్చు. రెగ్యులర్ మాస్ మసాలా ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఒక దర్శకుడు ప్రయత్నించినప్పుడు దాన్ని  గుర్తించి, అభినందించవలసిన అవసరం ఉంది.  అలాంటి కంటెంట్ వెయిట్, హానెస్టీ ఉన్న సినిమాల విషయంలో కూడా “అలా ఉంటే బాగుండేది… ఇలా ఉంటే బాగుండేది”…. అంటూ  చిన్న చిన్న లోపాలను హైలెట్ చేయడం కంటే సినిమాలో ఉన్న మంచిని పదింతలుగా హైలెట్ చేస్తే యూత్ లో ఉండే  ఆత్మవిశ్వాస ప్రపూరిత  ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని తట్టి లేపిన వారవుతారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


[youtube_video videoid=QvSP5gJkKg0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here