స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాలతో అలరించిన ఈ కాంబో… ఈ సారి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సందడి చేయనుంది. `నాన్న నేను` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు… ఈ వారంలోనే జరుగనున్నాయని సమాచారం. అలాగే… అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది యూనిట్. ఈ మేరకు… బన్నీపై ఓ ఫొటో షూట్ కూడా నిర్వహిస్తున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆపై శరవేగంగా చిత్రీకరణ జరిపి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. కాగా…ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: