డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “ఇస్మార్ట్ శంకర్”. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈషెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దిమాక్ ఖరాబ్ అంటూ సాగె ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.