చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సినిమా?

Chiranjeevi Movie Title For Bellamkonda Sreenivas Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bellamkonda Sreenivas Next Coming With Chiranjeevi Movie Title,Actor Bellamkonda Sreenivas Next Coming With Old Title,Bellamkonda Sreenivas New Movie Title News,Bellamkonda Sreenivas Upcoming Film Title,Mega Star Title For Bellamkonda Sreenivas New Movie
Chiranjeevi Movie Title For Bellamkonda Sreenivas Next

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సాయిశ్రీ‌నివాస్ తాజా చిత్రం `సీత‌` ఈ నెల 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా… మ‌రో వైపు త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `రాక్ష‌స‌న్‌` రీమేక్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. `రైడ్‌` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కోనేరు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నాయిక‌గా న‌టిస్తోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… చిత్ర క‌థానుసారం ఈ సినిమాకి `రాక్ష‌సుడు` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసే దిశ‌గా యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ని టాలీవుడ్ టాక్‌. గ‌తంలో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే. 1986లో వ‌చ్చిన నాటి `రాక్ష‌సుడు` మ్యూజిక‌ల్ హిట్ అయ్యింది. ఇక ఇదే టైటిల్‌తో నాలుగేళ్ళ క్రితం సూర్య హీరోగా ఓ త‌మిళ డ‌బ్బింగ్ మూవీ కూడా వ‌చ్చింది. మ‌రి… ఈ టైటిల్‌తోనే సాయిశ్రీ‌నివాస్ వ‌స్తాడా? లేదంటే మ‌రో టైటిల్ అవుతుందా? అన్న విష‌యంపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=1eQHokIL9wA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twenty =