ఫైనల్లీ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు టైమ్ ఫిక్స్ చేసిన దగ్గర నుండి ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. మహర్షి నుండి ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ సమయంలో ఇచ్చిన మ్యూజిక్ తోనే అద్భుతంగా అలరించిన దేవీ.. ఈ పాటలో కూడా మంచి మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ మాత్రమే కాదు తానే స్వయంగా పాడగా.. శ్రీ మణి లిరిక్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే చెన్నై షెడ్యూల్ ను కూాడా పూర్తి చేసుకున్న మహర్షి మరి కొద్ది రోజులలోనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టగా.. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సోషల్ మెసేజ్ తో పాటు , పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
[youtube_video videoid=Bxjx73i4pX4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: