ఇటీవలే టెంపర్ రీమేక్ అయోగ్య సినిమాలో ఓ పాట షూట్ చేస్తుండగా విశాల్ కు స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి గాయాలపాలయ్యాడు విశాల్. ప్రస్తుతం విశాల్ సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్ బైక్ అదుపుతప్పి పడిపోయారు. దాంతో ఆయన ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక చేతికి, కాలికి కట్టుకట్టి ఉన్న విశాల్ ఫొటోను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో ‘మదగజరాజా’, ‘ఆంబల’ చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఇది కాక విశాల్ తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్ చేస్తున సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుంది.
[youtube_video videoid=vm9dLvsbAhk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: