ఇప్పటివరకూ మనం ఎన్నో హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూసేఉంటాం. ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ జోనర్ లో వచ్చే ప్రతి సినిమాను అదే ఇంట్రెస్ట్ తో చూస్తారు. ఇక తాజాగా ఇదే హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా అదృశ్యం. వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవిప్రకాష్ దర్శకత్వంలో జాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22వ తేదీన రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హార్రర్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ భయపెట్టిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీ నటులు- జాన్, ప్రియాంక, అంగనారాయ్, సింగర్ కల్పన, జబర్దస్త్ ఆర్.పి, అప్పారావు, జయవాణి
డైరెక్టర్ – రవి ప్రకాష్
నిర్మాత – రవి ప్రకాష్
బ్యానర్ – వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్ – ఆల్డ్రిన్
ఎడిటింగ్ – ఆకుల భాస్కర్
కథ
హీరో ఆదర్శ్ (జాన్) పెద్ద బిజినెస్ మెన్. ఈ నేపథ్యంలో తను తన దగ్గర పనిచేసే హంస(అంగనా రాయ్) అనే అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. అలా వారిద్దరూ ప్రేమలో ఉన్నారనుకుంటుండగా ఇంతలో సడెన్ గా ఓ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆమె పేరు అనురాధ (ప్రియాంక). అయితే అనురాధ ఎవరో కాదు జాన్ భార్య. ఇక జాన్ తన భార్యని ఆఫీస్ లో పరిచయం చేస్తుండగా అనురాధను చూసి హంస షాకవుతుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అనురాధ ఓ గొప్పింటి అమ్మాయని.. డబ్బుకోసమే ఆమెను జాన్ పెళ్లి చేసుకున్నాడని అతని పై కోపంతో రగిలిపోతుంది. హంస, జాన్ మధ్య ఉన్న లవ్ ఎఫైర్ గురించి కూడా అనురాధకు తెలుస్తుంది. ఇక ఈ ముక్కోణపు సంఘర్షణలో సడెన్ గా ఒకరోజు జాన్ కనిపించకుండాపోతాడు. ఈ క్రమంలో అదృశ్యమో, హత్యనో తెలియని కేసును చేధించడానికి అపాయింట్ అవుతుంది ఏసీపీ చంద్రకాంత( సింగర్ కల్పన). ఆమె కూడా మరోపక్క జాన్ అదృశ్యం వెనుక ఉన్నటువంటి మిస్టరీని చేధించడానికి ప్రయత్నిస్తుంటుంది. అలాంటి సమయంలో జాన్ వాళ్ల ఇంట్లో ఓ అదృశ్య శక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఏవరిది? ఇంతకీ జాన్ ఏమయ్యాడు? జాన్ అదృశ్యం వెనుక ఉన్న హస్తం ఎవరిది? హంసదా? లేక తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనురాధే అతన్ని చంపిందా? ఇంతకీ జాన్ చనిపోయాాడా? బ్రతికే ఉన్నాడా? బ్రతికుంటే ఏమైంది? ఇలా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి హార్రర్ సినిమాలు ఎన్ని వచ్చినా.. ఏదైనా కొత్త దనం ఉంటే ఆ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి హార్రర్ జోనర్ లోనే మరో ఢిపరెంట్ సినిమా కోసం ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రవి ప్రకాష్. హార్రర్ మూవీకి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అలాంటి ఎలిమెంట్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా క్లైమాక్స్ లో ఉంటే ట్విస్ట్.. జాన్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని చేధించే క్రమంలో ఉండే ట్విస్ట్ లు సినిమాపై ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి.
ఇక ఈ సినిమాకు ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ప్రధాన బలం అని చెప్పొచ్చు. జాన్, అంగనా రాయ్, ప్రియ ముగ్గురూ మంచి నటనను కనబరిచారు. మాంత్రికురాలిగా ప్రత్యేక పాత్రలో నటించిన జయవాణి చాలా బాగా చేశారు. ఏసీపీ చంద్రకాంత పాత్రలో చేసిన సింగర్ కల్పనకు తనలో ఉన్న టాలెంట్ ను చూపించుకునే అవకాశం ఈ పాత్ర ద్వారా కలిగింది. ఇక అప్పారావ్, వాచ్ మెన్ గా నటించిన కిరాక్ ఆర్పీ, పని మనిషిగా సుందరి తమ పాత్రల మేరకు బాగానే నటించారు.
హార్రర్ సినిమా అంటే దానికి బలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేకపోతే సినిమా ఎంత బావున్నా ఏదో వెలితిగానే ఉంటుంది. అయితే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే సగం ప్లస్ పాయింట్. ఆల్డ్రిన్ చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. రామ్ పినిశెట్టి కెమెరా పనితనం.. ఆకుల భాస్కర్ ఎడిటింగ్ కూడా చాలా బావుంది.
ఓవరాల్ గా హార్రర్ సినిమాల్లోనే ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను చూడాలంటే ఈ సినిమాను తప్పక చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్
* నటీ నటుల నటన
* సినిమాటోగ్రఫి
* మ్యూజిక్
మైనస్ పాయింట్స్
* బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే
[wp-review id=”17748″]
[youtube_video videoid=PYxA3G9nrjw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: