మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గేలాగనే కనిపిస్తోంది. ఈసినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు ఒకదాని తరువాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాపై ఈసీకు ఫిర్యాదు చేసిన క్రమంలో సినిమా చూసిన తరునాతే యాక్షన్ తీసుకునే రైట్ ఈసీకి ఉంటుందని ఈసీవో చెప్పడంతో ఆ ప్రాబ్లమ్ అయిపోయిందనుకున్నారు. ఆ తరువాత సెన్సార్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియరైపోయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను ఇచ్చింది. దీంతో మార్చి 29 వ తేదీనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో.. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటిస్తున్నాడు.
మరి రిలీజ్ ముందే ఇంత రచ్చ జరిగితే.. రిలీజ్ తరువాత టీడీపీ పార్టీ వాళ్లు ఇంకెంత రచ్చ చేస్తారో.. వాళ్లని వర్మ ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం…
[youtube_video videoid=DUu1gScXol4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: