యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `సాహో`, `జాన్` (ప్రచారంలో ఉన్న పేరు). ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా త్రిభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక `జాన్` విషయానికి వస్తే… `జిల్` రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ ఇటీవలే యూరప్‌లో కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. కాగా… తాజా షెడ్యూల్‌ని గురువారం నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆర్.రవీందర్ తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం.
ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని 2020 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
[youtube_video videoid=KnxkRr1A6e0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: