పైన టైటిల్ ను చూసిన వెంటనే.. అదేంటీ మెగా హీరో పేరు మార్చుకున్నాడా..? ఇంతకీ ఏం పేరు మార్చుకున్నాడబ్బా..? ఈ పేరు బానే ఉంది కదా.. ఎందుకు మార్చుకున్నాడు? ఇలా డౌట్ల మీద డౌట్లు వచ్చే ఉంటాయి. అవును నిజంగానే సాయి థరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. అయితే కొత్త పేరు ఏం పెట్టుకోలేదు కానీ… తనకు ఉన్న పేరునే కాస్త షార్ట్ చేసుకొని మార్చుకున్నాడు. ఇన్ని రోజులు సాయి థరమ్ తేజ్ అని ఉండగా..ఇప్పుడు సాయి తేజ్ గా మార్చుకున్నాడు. ఈ విషయం ఈ రోజు తాను నటించిన చిత్రలహరి సినిమాలోని పరుగు పరుగు పాటను రిలీజ్ చేయగా..అందులో ఉన్న పేరును చూసి అర్ధమైంది. సో ఇక నుండి సాయి థరమ్ తేజ్ కాదు.. సాయి తేజ్ అని పిలవాలన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి సినీ ఇండస్ట్రీలో సెంటి మెంట్స్ ఉండటం కామనే. ఈ మెగా హీరో కూడా ఆ సెంటిమెంట్ నే ఫాలో అయి తన పేరును మార్చుకున్నట్టున్నాడు. మరి ఈ కొత్త పేరుతో అయినా తేజ్ కు లక్ కలిసొస్తుందేమో చూద్దాం..
[youtube_video videoid=yyYEX_Bk_L4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: