కొంత కాలం గ్యాప్ తరువాత వచ్చిన 96 సినిమాతో చెన్నై బ్యూటీ త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. 96 మంచి విజయం సాధించడంతో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ అఫర్ ను కొట్టేసింది త్రిష. ఇటీవల అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన బాలీవుడ్ మూవీ బద్లా మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో తాప్సీ ఖాతాలో మరో హిట్ వచ్చింది. ఓ హత్య కేసులో తాప్సీ ఇరుక్కోగా.. దానిని చేధించడానికి లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారట. తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాత ధనుంజయ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని.. త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
[youtube_video videoid=JPm_X8_5GAI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: