ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కె.జి.ఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలార్ బంగారు గనుల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా చాప్టర్ 1 కన్నడతో పాటుగా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేశారు. నిజానికి కన్నడలో 50 కోట్ల వసూళ్లు రావడమే కష్టం అలాంటిది.. కె.జి.ఎఫ్ ఏకంగా 250 కోట్లను వసూళు చేసి ఓ పెద్ద రికార్డే క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో 5 కోట్ల బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా 12 కోట్ల దాకా వసూళ్లు చేసిందంటే కె.జి.ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో కన్నడ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడం గొప్ప విషయం. దీంతో తెలుగులో ఈ సినిమా వసూళ్లు చూసి అందరు అవాక్కవుతున్నారు. మరి తెలుగులో ఈ సినిమా ఏరియాల వారిగా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
* నైజాం : 4.80 కోట్లు
* సీడెడ్ : 2.40 కోట్లు
* ఉత్తరాంధ్ర : 1.45 కోట్లు
* ఈస్ట్ : 0.72 కోట్లు
* వెస్ట్ : 0.60 కోట్లు
* కృష్ణా : 1.10 కోట్లు
* గుంటూరు : 0.90 కోట్లు
* నెల్లూరు : 0.30 కోట్లు
* రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన కలెక్షన్స్ : 12.27 కోట్లు
[youtube_video videoid=_ElvQ7C-xxU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: