`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`… ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో తనకు తిరుగులేదనిపించుకున్న అనిల్… ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. `దూకుడు` తరహాలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగనుందని సమాచారం. `మహర్షి` విడుదలయ్యాకే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మహేష్ సినిమా తరువాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ కూడా స్టార్ హీరోతోనే ఉంటుందని టాలీవుడ్ టాక్. నటసింహ నందమూరి బాలకృష్ణతో `రామారావు గారు` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయడానికి చాలా కాలం క్రితమే పక్కాగా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడట అనిల్. దీనికి… తాజాగా బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందిందని సమాచారం. అయితే… బోయపాటితో చేయబోయే సినిమా పూర్తయ్యాకే అనిల్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కించే దిశగా బాలయ్య ప్లాన్ చేశాడట. మొత్తమ్మీద… వచ్చే సంక్రాంతి తరువాత `రామారావు గారు` పట్టాలెక్కే అవకాశముందన్నమాట.
[youtube_video videoid=URxKw7MgD9k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: