కింగ్ నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ `మన్మథుడు` (2002)కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నాగ్‌కి జోడీగా అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్‌పుత్ నాయికలుగా నటించనున్నారని సమాచారం. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీతమందించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. హైదరాబాద్‌లో సాగే ఈ తొలి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుందట. ఆ తరువాత అదే నెల 12 నుంచి పోర్చుగల్ షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
[youtube_video videoid=ruEcJyx3c3M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: