`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. `నాన్న నేను` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పూజా హెగ్డే, కేథరిన్ ట్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తారని టాక్. అలాగే… త్రివిక్రమ్ చిరకాల మిత్రుడు, నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా కథకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… చిత్ర కథానాయకుడు అనుకోని పరిస్థితుల్లో ఓ అబద్దం ఆడతాడట. ఆ అబద్దాన్ని కాస్త నిజం చేయడానికి… సినిమా మొత్తం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడట. అలా… ఆ ప్రయత్నాల పర్వంలో చివరికి ఆ అబద్ధం కాస్త నిజం అయిపోతుందట. ఈ నేపథ్యంలో… హీరో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ వినోదాత్మకంగా సాగుతాయని సమాచారం. అలాగే తండ్రీకొడుకుల అనుబంధం కూడా ఈ కథకి కీలకమని తెలిసింది. మరి… ఈ స్టోరీ లైన్ ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: