షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చిత్రలహరి’

Sai Dharam Tej Chitralahari Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Chitralahari Wraps Up Shooting Schedule,Chitralahari Movie Latest Updates,Sai Dharam Tej New Movie Chitralahari Shooting News,Chitralahari Last Schedule Wraps Up,Chitralahari Movie Shooting Completed
Sai Dharam Tej Chitralahari Movie Shoot Wrapped Up

వరుస పరాజయాల తరువాత చిత్రలహరి అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.. మంచి ప్రమోషన్ స్టార్ట్ అంటూ.. యూనిక్ కాన్పెస్ట్ అంటూ టీజర్ మంచి టాకే సంపాదించుకుంది. ఇక తాాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదే విషయాన్ని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభవమని అన్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల టీమ్ కి .. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టీమ్ కి.. సినిమాటోగ్రఫర్ కార్తీక్ టీమ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. షూటింగ్ అయిపోయిన సందర్భంగా ఈ సినిమా టీమ్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు.


కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చిత్రలహరి మూవీ మంచి విజయం సాధించి సాయి ధరమ్ తేజ్ మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూద్దాం..!

[subscribe]

[youtube_video videoid=yyYEX_Bk_L4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 10 =