ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కిర్రాక్ పార్టీ ఎఫెక్ట్ తో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఆ నేపథ్యంలోనే అర్జున్ సురవరం అనే ఆసక్తికరమైన స్టోరీతో ముందుకు వస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా కాకుండా నిఖిల్ హీరోగా,నివేదా థామస్ హీరోయిన్‌గా అప్పట్లో శ్వాస అనే చిత్రం మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమా ఏం ఆగలేదంటున్నారు చిత్రయూనిట్. కిషన్ కట్ట దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో నిఖిల్ రోల్ కూడా రివీల్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడట. కాగా రెడ్ స్కై ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తేజ్ ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=-1BRbUtuBTY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: