రాజమౌళి దర్శకత్వంలో సినిమా…అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ బడ్జెట్ మూవీ.. ఇవి చాలు కదా సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి కూడా అదే. ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలు క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక హీరోయిన్స్‌కి సంబంధించి కూడా ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లు.. పరిణితి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపించాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ యాక్ట్రెస్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటన్నింటికీ క్లారిటీ ఇవ్వాలంటే అది రాజమౌళినే ఇవ్వాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా హీరోయిన్ల విషయంలో అసలే క్లారిటీ లేక అయోమయంలో ఉండగా.. మరోసారి సందిగ్దంలో పడేసింది బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా. ఈరోజు మీడియాతో ముచ్చటించిన పరిణితిని ఆర్ఆర్ఆర్ గురించి అడగ్గా.. ఆమె అటు ఖండించనూ లేదూ.. ఇటు క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు.. సరైన టైమ్ వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తానని చెప్పి తప్పించుకుంది.
మరి నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కా నటించే అవకాశం ఉన్నట్టు పరిణితి చోప్రా కంటే అలియా పేరే ఎక్కువ వినిపించింది. ఒకానొక సమయంలో అలియా మ్యాగ్జిమమ్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉన్నట్టే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిణితి అందరినీ సందిగ్దంలో పడేసింది. తను మాట్లాడిన దాన్నిబట్టి చూస్తే ఇప్పుడు పరిణితి చోప్రా కూడా ఒక హీరోయిన్ గా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే వీటన్నింటిని బట్టి చూస్తుంటే రెమ్యూనరేషన్ దగ్గర చర్చలు బాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది కనుక ఫైనల్ అయితే రాజమౌళి క్లారిటీ ఇస్తారేమో.
కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: