వేసవి వినోదాలకు రంగం సిద్ధమవుతోంది. ఓ వైపు అగ్ర కథానాయకుల చిత్రాలు… మరో వైపు యువ కథానాయకుల సినిమాలు ప్రేక్షకులను వినోదాల జల్లులో ముంచేందుకు ముస్తాబవుతున్నాయి. వీటితో పాటు భయపెడుతూనే నవ్వించడానికి హారర్ కామెడీ ఫిల్మ్స్ సందడి చేయబోతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… కేవలం నెల రోజుల గ్యాప్‌లో తెలుగు తెరపై మూడు హారర్ కామెడీ ఫిల్మ్స్ కు సంబంధించిన సీక్వెల్స్ తెరపైకి రాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తెలుగునాట హారర్ కామెడీ ట్రెండ్‌కి ఊపు తెచ్చిన చిత్రం `ప్రేమకథా చిత్రమ్`. ఆ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన `ప్రేమకథా చిత్రమ్ 2` ఏప్రిల్ 6న రిలీజ్ కానుంది. ఇందులో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా… ఏప్రిల్ 12న `అభినేత్రి` సీక్వెల్ `దేవి 2` విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాలో… మొదటి భాగంలో నటించిన ప్రభుదేవా, తమన్నా ప్రధాన భూమికలను పోషించారు. ఇక మే 1న `ముని` సిరీస్‌లో నాలుగో భాగమైన `కాంచన 3` రాబోతోంది. రాఘవ లారెన్స్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేదిక, ఓవియా హీరోయిన్లుగా నటించారు.
మరి… నెల గ్యాప్‌లో వస్తున్న ఈ సీక్వెల్స్ ఏ స్థాయిలో మెప్సిస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: