ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1 వ తేదీన రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది. పటాస్ తరువాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందింది. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఓ సీన్ ఉంటుంది.. ఆ సీన్ కు సంబంధించి ఇప్పుడు ఓ వీడియోను విడుదల చేయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా పనిచేస్తాడు. అయితే తనకు ఓ కల రావడం.. ఆ కలలో ఆద్య అనే అమ్మాయి దాడికి గురైనట్టు ఉండటం… కళ్యాణ్ రామ్ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లడమే స్టోరీ. కలలో కనిపించిన ఆ అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు నిజ జీవితంలో కూడా తారసపడుతాయి. దాంతో ఆద్య నిజంగానే ఉందని అనుకుని తన కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ క్రమంలో కొన్ని భయంకర నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు గౌతమ్. ఆ క్రమంలోనే ఈ అండర్ వాటర్ సీన్ కూడా ఉంటుంది. సినిమాలో ఈ సీన్ కూడా ఓ హైలైట్ అని చెప్పొచ్చు. అలాంటి ఈ సీన్ తీయడం వెనుక ఎంత కష్టం ఉందో.. ఆ సీన్ అంత అద్బుతంగా ఎలా వచ్చిందో… ఆ మేకింగ్ వీడియో మీరు కూడా చూసేయండి.
కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
[youtube_video videoid=oS7vJJXcBng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: