విలక్షణ నటనకు పెట్టింది పేరు… మోహన్ బాబు. తన అభినయ పర్వంలో తను పోషించని, మెప్పించని పాత్ర లేదు. ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య బాగా తగ్గించిన ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్… గత ఏడాది `గాయత్రి`, `మహానటి` చిత్రాల్లో తన మార్క్ నటనతో అభిమానులను మురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు రెండు ఇంట్రెస్టింగ్ తమిళ్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` చిత్రంలో మోహన్ బాబు ఓ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నాడని కోలీవుడ్ టాక్. అలాగే… సూర్య హీరోగా `గురు` ఫేమ్ సుధ కొంగర తెరకెక్కించనున్న సినిమాలోనూ మన కలెక్షన్ కింగ్ ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేయనున్నాడట. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావచ్చు. తమిళతంబీలకు సుపరిచితుడైన మోహన్ బాబు… ఈ రెండు చిత్రాలతో మరింత దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు.
[youtube_video videoid=IDA40ebDUs4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: