గత ఏడాది `ఛలో`, `గీత గోవిందం` చిత్రాలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కన్నడ బ్యూటీ రష్మిక. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా `డియర్ కామ్రేడ్`లో నటిస్తూ బిజీగా ఉంది. `గీత గోవిందం` తరువాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై సహజంగానే అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రష్మిక ఈ ఏడాది తమిళంలోనూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇప్పటివరకు రష్మిక కన్నడ, తెలుగు భాషల్లో నటించగా… ఆయా భాషల్లో ఆమె తొలి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మొదటి కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ` సెన్సేషనల్ హిట్ కాగా… తొలి తెలుగు చిత్రం `ఛలో` కూడా అదే బాటలో వెళ్ళింది. మరి… కార్తి కాంబినేషన్‌లో చేస్తున్న రష్మిక తొలి తమిళ చిత్రం కూడా అదే శైలిని కొనసాగిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=r6yjcLgY8p4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: