నేచురల్ స్టార్ నాని… మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ పాత్రలో కనిపించనున్న చిత్రం `జెర్సీ`. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు. కాగా… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ఈ సినిమా ప్రధానంగా మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ జీవితంలో 1986 నుంచి 1996 వరకు జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నాని నటిస్తున్నాడు. అంతేకాదు… నాని కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రంలో చూడొచ్చని ఇన్‌సైడ్ సోర్స్ టాక్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=aC0lLhI39Io]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: