సూపర్ స్టార్ రజనీకాంత్, బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో రజనీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఒక పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానూ, మరో పాత్రలో సోషల్ వర్కర్‌గానూ సూపర్ స్టార్ కనిపిస్తాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో… `రోబో`, `2.0` చిత్రాల్లో రజనీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… మురుగదాస్ కాంబినేషన్ మూవీతోనూ రజనీ మరోసారి డబుల్ రోల్‌లో అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.
కాగా… ఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార నటించనుందని తెలుస్తోంది. అలాగే `పేట`కి స్వరాలు అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కూడా సంగీతమందించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=9OmNwKei83o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: