`బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో… `సాహో`, `జాన్` (ప్రచారంలో ఉన్న పేరు) వంటి త్రిభాషా చిత్రాల్లో నటిస్తూ… పెరిగిన మార్కెట్‌కు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు ప్రభాస్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న `సాహో`ని `రన్ రాజా రన్` ఫేమ్ సుజీత్ రూపొందిస్తుండగా… పిరియాడిక్ లవ్ స్టోరీ అయిన `జాన్`కి `జిల్`ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆరు నెలల గ్యాప్‌లో అభిమానుల ముందుకు రాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం… ఓ కొత్త దర్శకుడితోనూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడని తెలిసింది. రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన కృష్ణ… ఈ మూవీతో డైరెక్టర్‌గా తొలి అడుగులు వేయబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా… ఇదివరకు ప్రభాస్ హీరోగా నటించిన `మున్నా` ద్వారా వంశీ పైడిపల్లి, `మిర్చి` ద్వారా కొరటాల శివ దర్శకులుగా తొలి అడుగులు వేసిన సంగతి తెలిసిందే. మరి… ముచ్చటగా మూడోసారి ప్రభాస్ పరిచయం చేస్తున్న దర్శకుడు కూడా వారిలాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతాడేమో చూడాలి.
[youtube_video videoid=pzkg9SrdKcw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: