బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్దా కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న హిందీ పింక్ తమిళ్ రీమేక్ మూవీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ లోనే జరుగుతుంది. సాహో మూవీ సెట్ కు అజిత్ వచ్చి ప్రభాస్ ను సర్ ప్రైజ్ చేశా రని సమాచారం. సెట్ లోకి హీరో అజిత్ ను సాదరంగా ఆహ్వానించి ప్రభాస్ఆయనతో కొంతసేపు ముచ్చటించి ఫోటోలు తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతాయని వారిద్దరికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.
[youtube_video videoid=KnxkRr1A6e0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: