`వీడొక్కడే`, `బ్రదర్స్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `కాప్పాన్` పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా… ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా సయ్యేషా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్య, బొమన్ ఇరాని నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… తాజాగా మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ… దర్శకుడు కె.వి.ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 2014లో వచ్చిన సక్సెస్‌ఫుల్ మూవీ `జిల్లా` తరువాత మోహన్ లాల్ నటిస్తున్న తమిళ చిత్రమిదే కావడం విశేషం. విలక్షణ పాత్రలకు చిరునామా అయిన మోహన్ లాల్… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి హారిస్ జైరాజ్ స్వరాలందిస్తున్నాడు.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: