ఇటీవల వచ్చిన చిన్న సినిమాల్లో హుషారు ఎంత మంచి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట చాలా తక్కువ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆ తరువాత మంచి టాక్ ను సంపాదించుకోవడం.. ఆతరువాత థియేటర్లను పెంచటం.. కనీసం రెండు మూడు వారాలు కూడా సరిగ్గా ఆడని రోజుల్లో ఏకంగా 50 రోజులకు పైగా ఆడటం ఈ సినిమా ఎంత విజయం సాధించిందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో హీరోగా నటించిన తేజస్ కంచెర్ల కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి ఈ యంగ్ హీరోకి. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనునున్నాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రపీ అందించనున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించనుంది.అయితే డెరైక్టర్ మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదట. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిన తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=KIIrIY7G6j4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: