వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్… తాజాగా `ఎఫ్ 2`తో `వంద కోట్ల గ్రాస్ క్లబ్` దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే… ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్‌ని కూడా అనిల్ రిజిస్టర్ చేయించినట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం… మహేష్, అనిల్ కాంబో మూవీకి `వాట్సప్` (what’s up) అనే ట్రెండీ టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్లు టాక్. అనిల్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా `పటాస్`ని మినహాయిస్తే… అతని ప్రతీ చిత్రం కూడా ఆంగ్ల శీర్షికలతోనే రూపొందాయి. ఇప్పుడు ఇదే వరుసలో కొత్త చిత్రానికి అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇంగ్లీష్ టైటిల్‌ని కంటిన్యూ చేస్తుండడం విశేషం. త్వరలోనే మహేష్, అనిల్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=TkA7tJ_hWSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: