విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అవుతుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ వర్మ ద్వారా కోలీవుడ్ కు పరిచయమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
E 4 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విభిన్న చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వం లో ధృవ్ , మేఘనా చౌదరి జంటగా తమిళం లో వర్మ మూవీ రూపొందింది. అనుకున్న స్థాయి లో వర్మ మూవీ సంతృప్తికరం గా లేకపోవడంతో టోటల్ మూవీ ని రీషూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దర్శకుడు బాల, హీరోయిన్ మేఘనా చౌదరి ఆ మూవీ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు వర్మ మూవీ ని బ్లాక్ బస్టర్ మూవీస్
అర్జున్ రెడ్డి, మహానటి సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. రీషూట్ చేసిన వర్మ మూవీ ని జూన్ నెలలో రిలీజ్ చేయనున్నారని సమాచారం.
[youtube_video videoid=by8JPatU_J4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: