`మ‌హానాయ‌కుడు` విడుద‌ల రోజే… బాల‌య్య కొత్త చిత్రం ప్రారంభం?

Balakrishna To Start A New Movie On Mahanayakudu Release Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Balakrishna New Movie Updates,Nandamuri Balakrishna Next Movie Latest News,Balakrishna To Start a New Film on NTR Mahanayakudu Movie Release Day,Balakrishna Upcoming Movies in 2019,Balakrishna Next Movie to Kick Start Soon
Balakrishna To Start A New Movie On Mahanayakudu Release Day

రెండు మాసివ్ హిట్స్ (`సింహా`, `లెజెండ్‌`) త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను… మ‌రో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్‌.బి.కె.ఫిల్మ్స్ ప‌తాకంపై బాల‌కృష్ణ స్వ‌యంగా నిర్మించ‌నున్న ఈ సినిమాని `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు` విడుద‌ల తేది అయిన ఫిబ్ర‌వ‌రి 22న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు… ఎన్నిక‌ల స‌మ‌యంలో చిత్రీక‌ర‌ణకు విరామం ఇచ్చి… ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు షూటింగ్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. కాగా… ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ దాదాపుగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యేన‌ట్లేనని వినికిడి. 2020 సంక్రాంతి కానుక‌గా రానున్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఈ సినిమాలో ఉంటుంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=O6bBpm0si8k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.