సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో పలు ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా `ఎఫ్ 2`లోనూ తన మార్క్ కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే ఆ చిత్ర ఘనవిజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక… హాస్యభరిత పాత్రల పరంగా వెంకీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచే పాత్రల్లో… `మల్లీశ్వరి` చిత్రంలోని `పెళ్ళి కాని ప్రసాద్` క్యారెక్టర్ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ముదురు వయసు బ్రహ్మచారిగా వెంకీ నటన ఆ సినిమాకే ప్రధాన బలంగా నిలచింది. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కె.విజయ భాస్కర్ బ్రాండ్… ఈ సినిమాకి అదనపు ఆకర్షణలుగా నిలచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సునీల్, కోట శ్రీనివాసరావు, నరేష్, హేమ, స్మిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కోటి స్వరసారథ్యంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ఫిబ్రవరి 18, 2004న విడుదలైన `మల్లీశ్వరి`… నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
[youtube_video videoid=a8jLt8-NJCI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: