కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ‘ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాపా నీకేదంటే ఇష్టం, టీజర్ గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. రేపు సాయంత్రం (ఫిబ్రవరి 19) 6 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాను ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మిస్తున్నారు. హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ వెంకట్ఆ, ర్.శాఖమూరి. కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్.
[youtube_video videoid=H3QCReUyOaI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: