క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా… ఎన్టీఆర్ మహానాయకుడు రీలిజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాాాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేశారు. రేపు ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 5.55 నిమిషాలకు ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మరి కథానాయకుడు ఫలితం చూసిన తర్వాత ‘మహానాయకుడు’ పైన కూడా అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని మహానాయకుడు సినిమాను తీశారని..
ఆ క్రమంలోనే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. మరి ఎన్టీఆర్ సినీ జీవితం సగంతి ఏమో కానీ.. రాజకీయ జీవితంలో మాత్రం చాలా మలుపులున్నాయి. అలాంటి రాజకీయాలతో ముడిపడిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వెండితెరపై చూడాల్సిందే.
[youtube_video videoid=yniqedqznIY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: