రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ బాబుతో తన తరువాత చిత్రం ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా…అవి వార్తలుగా ఉన్నాయి తప్పా..ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా మహేశ్ తో సినిమా విషయంలో సుక్కు సైడ్ అయిపోయి అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరితో సినిమా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాతగా కూడా మారి ఈ మధ్య సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ రైటర్స్ అనే సంస్థను స్థాపించిన సుక్కు చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి రెండు సినిమాలను నిర్మిస్తున్నాడు సుకుమార్. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లనే డైరెక్టర్లుగా పరిచయం చేస్తూ సినిమాలు రూపొందిస్తున్నాడు. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెలతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా అని.. సుక్కు శిష్యులలో ఒకరు దర్శకత్వం వహిస్తారని ఫిలింనగర్ టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలన్నా అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=vcmWerOF1yA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: