టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సంక్రాంతికి `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2` చిత్రాలతో సందడి చేసిన డీఎస్పీకి… `ఎఫ్ 2` రూపంలో మరో ఘనవిజయం తన ఖాతాలో జమ అయింది. కాగా… ఇదే జోష్‌లో ఈ వేసవికి (ఒకే నెలలో) మరో రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. ఆ సినిమాలే `చిత్రలహరి`, `మహర్షి`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న `చిత్రలహరి` వేసవి కానుకగా ఏప్రిల్ 12న విడుదల కానుండగా… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మహర్షి` ఏప్రిల్ 25న తెరపైకి రానుంది. ఆసక్తికరమైన విషయేమిటంటే… గత వేసవికి `రంగస్థలం`, `భరత్ అనే నేను`తో పలకరించిన దేవిశ్రీకి ఆ యా చిత్రాలు ఘనవిజయాలను అందించాయి. మరి… అదే సెంటిమెంట్ ఈ వేసవిలోనూ రిపీట్ అయి `చిత్రలహరి`, `మహర్షి` కూడా దేవిశ్రీకి మంచి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
[youtube_video videoid=EajDvsGogpA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: