లవర్స్ డే తెలుగు మూవీ రివ్యూ

ఒక్కసారి కన్నుగీటి కుర్రకారును తనవైపుకు తిప్పుకొని ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. స్కూల్ డేస్ ప్రేమ నేపథ్యంలో ఒమర్ లులు దర్శకత్వంలో ఒరు అదార్ లవ్ అనే మలయాళ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. ఇక అటు మలయాళంలోనూ..ఇటు తెలుగులో ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. మరి కన్నుగీటుతోనే అందర్నీ పడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ లక్ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్, నూరిన్ షరీఫ్, సియాద్ షాజహాన్
డైరెక్టర్ – ఒమర్ లులు
సంగీతం – షాన్ రెహ్మాన్
నిర్మాతల – సి.హెచ్‌.వినోద్‌రెడ్డి, ఎ. గురురాజ్‌
సినిమాటోగ్రఫర్ : శీను సిద్ధార్థ్‌

కథ:

హీరో, హీరోయిన్ రావూఫ్ రోషన్ (రోషన్) ప్రియా (ప్రియా ప్రకాష్ వారియర్) డాన్ బాస్కో స్కూల్లో ఇంటర్ చదువుతుంటారు. ఇక స్కూల్ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి.. అన్ని సినిమాల్లో లాగానే ఇందులోనూ ప్రియను …రోషన్ టీజ్ చేస్తాడు. దాంతో రొటీన్ గానే వాళ్లిద్దరూ ప్రేమలాంటి ఆకర్షణలో పడతారు. ప్రియా కూడా రోషన్ ను ప్రేమిస్తుంది కానీ తన ప్రేమను మాత్రం చెప్పకుండా ఆటపట్టిస్తుంటది. అయితే గాధ (నూరిన్ షెరిఫ్‌) సహాయ సహకారాలతో రోషన్ అండ్ ప్రియా తమ ప్రేమను ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. ఇలా సాగుతున్న క్రమంలో అనుకోని ఓ సంఘటన వల్ల రోషన్, ప్రియా విడిపోతారు. ఆ తరువాత ప్రియ తన చదువులపై దృష్టి పెట్టగా.. రోషన్ మాత్రం గాధకు ఎట్రాక్ట్ అవుతుంటాడు. ఇక ఇది చూసిన ప్రియా జలస్ ఫీలవుతుంది. ఈ నేపథ్యంలో నిజంగానే రోషన్ గాధకు ఎట్రాక్ట్ అవుతాడా? రోషన్, ప్రియా మళ్లీ కలుస్తారా? గాధకు రోషన్ పై ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి ? గాధ, రోషన్ బంధం ఫైనల్ గా ఎలా ముగుస్తోంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఈ సినిమాకు అంత క్రేజ్ రావడానికి ప్రియా ప్రకాష్ వారియర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ క్రెడిట్ మాత్రం తనకు ఇవ్వాల్సిందే. ఒకే ఒక్క కన్నుగీటుతో సినిమాపై అంచనాలను అమాంత పెంచేసేంది. ఇక ఈ సినిమాలో కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంట మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అలాగే వారి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరిఫ్‌ కూడా తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తోంది. హీరోకు ఆమెకు మధ్య వచ్చే సీన్లు.. వారి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె కూడా చాలా బాగా నటించింది.

ఫ్యూన్ మరియు డ్రిల్ మాస్టర్ మధ్య వచ్చే కామెడీ, ద్రౌపది నాటకం లాంటి కొన్ని సీన్లు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇక మిగిలిన వారు తమ పాత్ర పరిథి మేర బాగానే నటించారు.

ఇక దర్శకుడు ఒమర్ లులు స్కూల్ నేపథ్యంలో స్టోరీని తీసుకొని బాగానే తెరకెక్కించాడు. నిజానికి ఈ స్టోరీ లైన్ ఎప్పటిదో అని అందరికీ తెలిసిందే. ఇలాంటివి మనం బోలెడు చూసేసాం. అయితే మరోసారి డైరెక్టర్ అదే పాత లైన్ ను తీసుకొని కొత్తగా చూపే ప్రయత్నం చేశారు. స్నేహం, ప్రేమ విలువను వాటి మధ్య తేడాను చెప్పే ప్రయత్నచేశారు.

సంగీతం విషయానికి వస్తే ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయి. వాటిలో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్ అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. పాటలు మాత్రం బాగా తీసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ కు మాత్రం ఈ సినిమా బాగానే నచ్చేస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందో? లేదో? చెప్పడం కష్టమే.

 

[wp-review id=”15546″]

[subscribe]

[youtube_video videoid=ZFyALKfVjQE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.