చక్కనమ్మ చిక్కినా అందమే అనే సామెత ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కకు బాగా సరిపోయేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తన లేటెస్ట్ లుక్స్ చూస్తే అలానే అనిపిస్తోంది మరి. గత ఏడాది భాగమతి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనుష్క ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. భాగమతి తరువాత ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు తనది. ఇక ఇప్పుడు తాజాగా హేమంత్ మధకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ థ్రిల్లర్ మూవీలో నటించబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్యాప్ లో అనుష్క అమెరికాలో తన వెయిట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా.. అందరూ అనుష్క లుక్ ను చూసి షాక్ అవ్వడంతో పాటు ఫిదా అవుతున్నారు. సన్నబడినా కూడా అనుష్కలో గ్లో ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా అనుష్క నటించనున్న కొత్త సినిమా షూటింగ్ మార్చి నుండి అమెరికాలో జరుపుకోనుంది. ఇక అక్కడ క్లైమెట్ మైనస్ డిగ్రీల్లో ఉండటంతో.. అలాంటి వాతావరణంలో సినిమా షూటింగ్ జరుపుకోవడం ఆ టీమ్ కు పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఇంకా ఈసినిమాలో మాధవన్, షాలినిపాండే, అంజలి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=hlSN_rLuht0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: