సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే చూస్తారు. కంటెంట్ కాస్త సాలిడ్ గా ఉంటే చాలు.. దర్శక నిర్మాతలకు పండగే. సినిమాను హిట్ చేసి పడేస్తారు ప్రేక్షకులు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తోనే ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతుంది. అదే మాయ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వామిరారా, దోచెయ్, కేశవ సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రవీణ్ వర్మ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తాను నిర్మాతగా మారి.. నూతన నటీనటులతో మాయ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ నుండి ఆసక్తి పెంచుతున్న ఈసినిమా టీజర్ తో ఆ ఆసక్తిని ఇంకా పెంచిందని చెప్పొచ్చు. ఇటీవల రిలీజ్ అయిన మాయ టీజర్ ను చూస్తుంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తోనే ప్రేక్షకులను థ్రిల్ చేసేలాగ కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో టీజర్ తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు.
మరి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి టీజర్ కు అయితే మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంతవరకూ థ్రిల్ చేస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
డైరెక్టర్ – ప్రవీణ్ వర్మ
నిర్మాత – సుధీర్ వర్మ
కథ – కృష్ణ చైతన్య
సినిమాటోగ్రఫి – భరత్ కుమార్
[youtube_video videoid=6-rm6wtc7Vg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: