ఈ మధ్య షూటింగ్ లు పూర్తయిన వెంటనే గిఫ్ట్స్ ఇవ్వడం ఓ సాంప్రదాయంగా మారిపోయింది. ఒకప్పుడు అలనాటి మహానటి సావిత్రి ఇలా చేస్తుండేవారు. తాను నటిస్తున్న టైమ్ లో చిత్ర యూనిట్ ఇలా గోల్డ్ కాయిన్స్ ఇస్తుండేవారు. ఆ తరువాత ఆమె బయోపిక్ లో నటించిన నేపథ్యంలో కీర్తి సురేష్ మహానటి సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు.. సావిత్రి సాంప్రదాయన్నే పాటించింది. అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. పందెంకోడి 2 చిత్ర షూటింగ్ పూర్తయినప్పుడు కూడా యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈజాబితాలోకి లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా చేరిపోయింది. నయనతార ప్రస్తుతం ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజే దర్శకత్వంలో శివ కార్తికేయన్ సరసన ‘మిస్టర్ లోకల్’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ భామ. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ కు ఫాసిల్ వాచ్ లను గిఫ్ట్ గా ఇచ్చింది. మొత్తానికి ఈనాటి హీరోయిన్లు ఇలాంటి సాంప్రదాయాలు పాటించడం హర్షించతగ్గ విషయమే.
కాగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా, హిప్ హాప్ తమిళ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకానుంది.
[youtube_video videoid=I-2Ei9L_Avg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: